- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mohan Babu: నా హృదయంలో స్పెషల్ ప్లేస్ దానికే.. మోహన్ బాబు ఎమోషనల్ ట్వీట్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు(Mohan Babu) ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘నా సినీ కెరీర్‌లో ఈ చిత్రం ఒక మైలు రాయి. రాఘవేంద్రరావు అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఒక మాస్టర్ పీస్. ముఖ్యంగా ఈ సన్నివేశం నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా ఆ స్పెషల్ సీన్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. అయితే రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో 1982లో వచ్చిన సినిమా ‘దేవత’(Devatha). ఇందులో శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద కీలక పాత్రల్లో నటించారు. అయితే ఇన్నాళ్లకు మోహన్ బాబు ఈ చిత్రం గురించి పోస్ట్ పెట్టడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే.. మంచు విష్ణు(Manchu Vishnu ) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’(Kannappa) కోసం వర్క్ చేస్తున్నారు. ఇందులో ఓ పాత్ర చేయడంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
'Devatha'(1982) marked a milestone in my career and a masterpiece in Telugu cinema, elegantly directed by the legendary K. Raghavendra Rao garu. This scene hold a profound & special place in my heart.
— Mohan Babu M (@themohanbabu) December 2, 2024
🎥 Video Credits: Suresh Productions
🎬 Movie Producer Credits: D. Rama Naidu… pic.twitter.com/QPdiCsSCq6