ఇంటర్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ను అభినందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

by Kalyani |
ఇంటర్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ను అభినందించిన  మంత్రి సబితా ఇంద్రారెడ్డి..
X

దిశ, జడ్చర్ల: ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 992 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచిన కర్నేకోట నాగేకారి సాయితేజను శనివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన స్వగృహానికి పిలిపించుకొని శాలువా కప్పి, బొకేలు అందించి అభినందించారు.

ఈ సందర్భంగా సాయితేజ స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించడం కోసం చేసిన కృషిని మంత్రి కొనియాడారు. భవిష్యత్ లో మరింత శ్రద్ధగా చదువుకొని అత్యున్నత స్థానానికి ఎదగాలని సాయితేజకు సూచించారు. ఈ కార్యక్రమంలో మీర్ పేట్ బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఆరె కటిక సంఘం అధ్యక్షురాలు జమాల్ పూర్ సునీత బాల్ రాజ్, శశిధర్, యాదిలాల్ జీ లు పాల్గొన్నారు.

Advertisement

Next Story