- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నడిగడ్డలో ఎక్కడుంది సస్యశ్యామలం.. మంద జగన్నాథం
దిశ, అలంపూర్ టౌన్ : నడిగడ్డలో సస్యశ్యామలం ఎక్కడుందని మంద జగన్నాథం కేసీఆర్ ను ప్రశ్నించారు. గురువారం అలంపూర్ హరిత టూరిజం హోటల్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంద జగన్నాథం మాట్లాడుతూ పెత్తందారి ఒత్తిడికి తలొగ్గి చేతగాని వాడికి టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ ను ఓడించి సంపత్ కుమార్ ను గెలిపించాలని కోరారు. తీవ్రవర్షాభావంతో జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి అన్నారు. రైతులు తీవ్రఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ మాత్రం జిల్లాను సస్యశ్యామలం చేశానని చెప్పుకుంటున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రాజెక్టులన్ని కట్టింది కాంగ్రెస్ పార్టీ, అలంపూర్ నియోజకవర్గానికి తుమ్మిళ్ల ఎత్తిపోతల ఏర్పాటు చేసి సెకండ్ ఫేజ్ జలాశయాలు నిర్మించకపోవడంతో తుమ్మిళ్ల ద్వారా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శించారు. రైతుల పంటలు ఎండిపోతుంటే పట్టించుకోని వారు మరలా ఇప్పుడు ఎలక్షన్ల కోసం నీళ్లు వదిలి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని ప్రజలు దీన్ని ఎవరు నమ్మవద్దని కోరారు. అలంపూర్ నియోజకవర్గాన్ని గతంలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ అని అన్నారు. అందువల్ల అనుభవజ్ఞుడైన సంపత్ కుమార్ కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అత్యధికంగా పాల్గొన్నారు.