అంగరంగ వైభవంగా మైసమ్మ జాతర ప్రారంభం

by Naveena |
అంగరంగ వైభవంగా మైసమ్మ జాతర ప్రారంభం
X

దిశ, నవాబుపేట :మండల పరిధిలోని పర్వతాపూర్ అటవీ క్షేత్రంలో ప్రకృతి సోయగాల మధ్యన వెలసిన మహిమాన్విత మైసమ్మ దేవత జాతర బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు నిర్వహించబడే ఈ జాతర బ్రహ్మోత్సవాలను సాంప్రదాయబద్ధంగా భక్తుల కోలాహలం మధ్య దేవస్థానం పాలకవర్గం చైర్మన్ తిప్పిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బాజా భజంత్రీలు, డప్పుల దరువుల మధ్య కాకర్ల పహాడ్ గ్రామస్తులు తమ గ్రామం నుండి భారీ జన సందోహంతో తరలివచ్చి అమ్మవారికి కుంకుమ,పట్టు వస్త్రాలు సమర్పించారు. వారు తెచ్చిన కుంకుమ,పట్టు వస్త్రాలను అందుకున్న ఆలయ అర్చకులు అమ్మవారి దేవాలయంలో గణపతి పూజ, కలశ స్థాపనలు చేసి ధ్వజారోహణ గావించారు. అనంతరం వారు అమ్మవారికి విశేషాలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, పాలకమండలి సభ్యులు, గ్రామ ప్రముఖులు,అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story