- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్సీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.. జిల్లా ఎస్పీ నరసింహ
దిశ, మహబూబ్ నగర్: త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన నేర సమీక్షా సమావేశంలో ఆయన తన సిబ్బందితో మాట్లాడారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ, గ్రేవ్ క్రైం కేసుల పరిశోధన త్వరితగతిన పూర్తి చేయడంలో శ్రద్ధ వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలను తీసుకుంటూ నకిలీ విత్తనాల మీద ప్రత్యేకంగా నిఘా ఉంచాలని సూచించారు.
పేలుడు పదార్థాల అక్రమ నిల్వలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే సీసీటీఎన్ఎస్ లో సర్టిఫికేట్లకు ప్రాధాన్యతనిచ్చి అప్లోడ్ చేసిన భూత్పూర్, మహబూబ్ నగర్ టౌన్, మహమ్మదాబాద్ పీఎస్, జడ్చర్ల రూరల్ సర్కిల్ ఎస్ఐ, సీఐలు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఆయన నగదు బహుమతులను అందజేశారు. ఈ సమావేశంలో డిఎస్పీలు మహేష్, జీవీ రమణారెడ్డి, ఆదినారాయణ, మధు, లక్ష్మణ్, శ్రీనివాసులు, సీఐలు, రిజర్వ్ సీఐలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.