- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి : జిల్లా ఎస్పీ జానకి
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: గత సంవత్సరంతో పోల్చి చూసుకుంటే జిల్లాలో క్రైం రేటు స్వల్పంగా పెరిగిందని, నేరస్తులకు నేరానికి తగ్గ శిక్షలు విధించడంలో పూర్తిగా సఫలీకృతం అయ్యామని, జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి.జానకి అన్నారు. ఆదివారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో 2024 సంవత్సరం కు సంబంధించిన వార్షిక క్రైం రిపోర్టు పై నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడారు. సమాజంలో శాంతిని నెలకొల్పడంలో, ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. నేరాలను నివారించడంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, పౌరుల భద్రత, శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని ఆమె అన్నారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాలు, ఫోక్స్ కేసుల చట్టాలు, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి, కమ్యూనిటీ పోలీసింగ్ సోషల్ మీడియా ద్వారా, కళాజాత బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, జిల్లా ప్రజలు, విద్యార్థులు, పౌరులను చైతన్య పరుస్తున్నామని ఆమె వివరించారు.
జిల్లా పోలీసుల పారదర్శక పనితీరు విధానం వలన ప్రజలలో పోలీసులపై విశ్వాసం, నమ్మకం పెరిగిందని ఎస్పీ అన్నారు. 2024 సంవత్సరంలో జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తూ పార్లమెంటు ఎన్నికలు, వీవీఐపీ, ఇతర విఐపి ల పర్యటనలు, గ్రూప్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. గత సంవత్సరంలో జిల్లా పరిధిలో 5869 కేసులు నమోదవ్వగా, ఈ సంవత్సరం డిసెంబర్ 27 వరకు 5887 కేసులు నమోదు అయ్యాయని, అత్యధికంగా జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో 913, మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో 844 కేసులు,అత్యల్పంగా మహబూబ్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్ లో 130, ముసాపేట్ మహిళా పీఎస్ లో 204 కేసులు నమోదు అయ్యాయని ఆమె వివరించారు.
వివిధ రకాల నివారణా చర్యలు చేపట్టి రోడ్డు ప్రమాదాలను నివారించగలిగామని, ముమ్మరంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి, డ్రంకన్ డ్రైవ్ లను గణనీయంగా తగ్గించామని, జిల్లాలో తిరిగే ఆటోలకు ట్రాఫిక్ పీఎస్ వారి వరుస నెంబర్లను వేసి, నేరాలకు పాల్పడకుండా నియంత్రిస్తూ, ప్రజలకు భరోసా కల్పించామని, సైబర్ నేరాల పట్ల సీనియర్ సిటిజన్ లకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, భరోసా సెంటర్ల ఏర్పాటు, ర్యాగింగ్, ఫోక్స్, ఈవ్ టీజింగ్ లపై పాఠశాల, కళాశాలల, యూనివర్సిటీ, మెడికల్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, భరోసాను నింపామని ఆమె పేర్కొన్నారు.
ఇంతేకాక గ్రామాల్లో దొంగతనాలు, దోపిడీలపై తగు జాగ్రత్తలు, సీసీ కెమెరాల ఆవస్యకతను వివరించామని తెలుపుతూ అన్ని కోణాల్లో నేరాలు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, ఫోక్స్ కేసులు, బాల కార్మికులు, బాల్య వివాహాలు, బాల్య నేరాలు జరగకుండా, అలాగే లోక్ అదాలత్ లో రాజీపడ్డదగ్గ కేసులను రాజీ కుదిర్చి కేసులను పరిష్కరించామని ఎస్పీ జానకి వివరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ లు రాములు, సురేష్ కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, రమణారెడ్డి,అన్ని పోలీస్ స్టేషన్ల సిఐ, ఎస్ లు, సిబ్బంది పాల్గొన్నారు.