Central Cabinet Meeting: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ఆ ఆంశాలపైనే కీలక చర్చ!

by Shiva |
Central Cabinet Meeting: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ఆ ఆంశాలపైనే కీలక చర్చ!
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త ఏడాదిలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన కేంద్ర కేబినెట్ (Central Cabinet) ఉదయం 10.30కి సమావేశం కానుంది. ఈ సందర్భంగా భేటీలో ప్రధానంగా వ్యవసాయం (Agriculture), రైతుల (Farmers) అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అన్నదాతలకు గుడ్ న్యూస్ కూడా చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం (PM Kisan Samman Yojana) ద్వారా ఇచ్చే మొత్తాన్ని రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు.

అదేవిధంగా దేశ వ్యాప్తంగా కొనసాగుతోన్న పలు కీలక ప్రాజెక్టులు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలకు నేటి కేబినెట్ సమావేశంలో చర్చించి వాటికి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ఓ ప్రకటన చేయనున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ‘ఈ ఏడాది అందరికీ కొత్త అవకాశాలతో పాటు విజయాలు, అంతులేని ఆనందం తీసుకురావాలి’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ తన ‘X’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed