Yadagirigutta : యాదగిరిగుట్టలో కొత్త సంవత్సరం రద్దీ

by Y. Venkata Narasimha Reddy |
Yadagirigutta : యాదగిరిగుట్టలో కొత్త సంవత్సరం రద్దీ
X

దిశ, వెబ్ డెస్క్ : నూతన సంవత్సరం(New Year)తొలి రోజు జనవరి 1 పురస్కరించుకుని ఏడాది అంతా మంచి జరుగాలని ఆకాంక్షిస్తూ ప్రజలు పెద్ద సంఖ్యలో ఆలయాల సందర్శనకు తరలడంతో ప్రముఖ పుణ్యక్షేత్రాల(Pilgrimage Sites)న్ని భక్తుల(Devotees)తో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాని(Sri Lakshmi Narasimha Swamy Temple Yadagirigutta)కి నూతన సంవత్సరం భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. భక్తుల సందడితో కొండకింద పుష్కరణి ప్రాంతం..ఘాట్ రోడ్లు..కొండపైన ఆలయ పరిసరాలు అన్ని కిటకిటలాడాయి. నూతన సంవత్సరం వేళ స్వామివారిని దర్శించుకోవాలన్న తపనతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ అర్చక బృందం స్వామివారికి నిత్యాభిషేకాలు, పూజలు, కైంకర్యాలు ఆగమశాస్త్రానుసారం కొనసాగించారు. లక్ష్మీనరసింహుల నిత్య కల్యాణోత్సం ఘనంగా నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed