Russia-Ukrain: మా దేశానికి శాంతిని బహుమతిగా ఎవరూ ఇవ్వలేరు- జెలెన్ స్కీ

by Shamantha N |
Russia-Ukrain: మా దేశానికి శాంతిని బహుమతిగా ఎవరూ ఇవ్వలేరు- జెలెన్ స్కీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌- రష్యా (Russia-Ukrain) యుద్ధంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Volodymyr Zelenskyy) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి శాంతిని బహుమతిగా ఎవరూ ఇవ్వలేరని పేర్కొన్నారు. అమెరికా(USA) తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) తమవైపే ఉన్నారన్నారు. ‘శాంతిని బహుమతిగా ఎవ్వరూ ఇవ్వలేరని మాకు తెలుసు. రష్యాను ఆపడానికి, యుద్ధాన్ని ముగించడానికి ప్రతిదీ చేస్తాం. 34 నెలలుగా రష్యా చేస్తున్న దురాక్రమణను అడ్డుకోవడంలో అమెరికా మావైపే ఉంటుందని బలంగా విశ్వసిస్తున్నా. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Putin) దూకుడును ట్రంప్‌ ఆపుతారనడంలో మాకు ఎలాంటి సందేహం లేదు. ఇరుపక్షాలను శాంతపరచడానికి ఇది వీధి గొడవ కాదు. ఇవాళ రష్యా మీకు షేక్‌ హ్యాండ్‌ ఇస్తే.. రేపు చంపదని గ్యారెంటీ లేదు. రష్యన్లకు స్వేచ్ఛ, స్వేచ్ఛగా ఉండేవారంటే భయం. కొత్త సంవత్సరంలో ఉక్రెయిన్ బలంగా ఉండటానికి అందరం కలిసి పోరాడాలి’ అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. "రాబోయే సంవత్సరంలో ప్రతి రోజు, ఉక్రెయిన్ తగినంత బలంగా ఉండటానికి అందరం కలిసి పోరాడాలి." అని చెప్పుకొచ్చారు.

క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా దాడి

2022 ప్రారంభం నుంచి రష్యా- ఉక్రెయిన్ (Russia-Ukraine)ల మధ్య యుద్ధం జరుగుతోంది. కీవ్‌తో యుద్ధంలో దాదాపు 10వేల మంది ఉత్తరకొరియా (North Korea) సైనికులు మాస్కో తరఫున పోరాడుతున్నారు. తొలుత వీరికి ప్రత్యేక శిక్షణ ఇప్పించినప్పటికీ.. భాష సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కీవ్‌ బలగాల చేతుల్లో హతమవుతున్నారని వార్తలొస్తున్నాయి. ఇకపోతే, అమెరికా ఉక్రెయిన్‌కు అండగా నిలిచింది. 2022 నుంచి అమెరికా.. కీవ్‌కు ఇప్పటివరకు 62 బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలను, ఇతర సాయాన్ని అందించింది. మరోవైపు.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి తాను ముగింపు పలుకుతానని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) పలుమార్లు వెల్లడించారు. అధికారం చేపట్టిన తర్వాత యుద్ధం ఆగుతుందా, శాంతి ప్రక్రియకు ఎలాంటి ప్లాన్ అమలుచేయనున్నారో తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed