Hari Hara Veera Mallu : ప‌వ‌న్ ఫ్యాన్స్ కు న్యూ ఇయ‌ర్ గిఫ్ట్‌.. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు నుంచి ఫ‌స్ట్ సింగిల్ ‘మాట వినాలి’

by Prasanna |   ( Updated:2025-01-01 12:48:39.0  )
Hari Hara Veera Mallu : ప‌వ‌న్ ఫ్యాన్స్ కు న్యూ ఇయ‌ర్ గిఫ్ట్‌..  హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు నుంచి ఫ‌స్ట్ సింగిల్ ‘మాట వినాలి’
X

దిశ, వెబ్ డెస్క్ : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ( Pawan Kalyan) ఓ వైపు రాజ‌కీయాలు చేస్తూనే మ‌రో వైపు సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయ‌న న‌టిస్తున్న సినిమాల్లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు కూడా ఒక‌టి. కొత్త ఏడాది సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి కొత్త అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేటును మేకర్స్ ప్ర‌క‌టించారు. " మాట వినాలి అంటూ" సాగే ఈ పాటను ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాడారు. ఈ సాంగ్ ను జ‌న‌వ‌రి 6న ఉద‌యం 9 గంట‌ల 6 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఆస్కార్ విన్న‌ర్ ఎంఎం కీర‌వాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. సూర్య‌మూవీస్ పతాకం పై ఏఎం ర‌త్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది ఈ సినిమా. అయితే, ఫస్ట్ పార్ట్ మార్చి 28న వరల్డ్ వైడ్ గా ఆడియెన్స్ ముందుకు రానుంది.

మొద‌ట క్రిష్ డైరెక్షన్ లో ఈ మూవీ రూపుదిద్దుకుంది. అయితే, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న త‌ప్పుకోవ‌డంతో మిగిలిన భాగానికి జ్యోతి కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఏపీలో ఎన్నిక‌ల జరిగే సమయంలో ప‌వ‌న్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన‌లేదు. మ‌రో ఎనిమిది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని ప‌వ‌న్ వెల్లడించాడు. ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed