ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలి

by S Gopi |
ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలి
X

దిశ, పాలమూరు: ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే పదోన్నతులు, బదిలీల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మ లచ్చిరాం డిమాండ్ చేశారు. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులను ఉదేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, 5 సం.లుగా బదిలీలు లేవని తద్వారా విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం జోక్యం చేసుకుని పదోన్నతుల ప్రక్రియను పునప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పండిత, పీఈటీ పోస్టులకు కూడా ఈ షెడ్యూల్లోనే పదోన్నతులు కల్పించాలని కోరారు. 317 బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని కోరారు. తమ సంఘం తెలంగాణ కొరకు ఏర్పడిన సంఘమని, ఉద్యమ సమయంలో సమైక్యవాదాన్ని వీడి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినదని గుర్తుచేశారు. తమ సంఘ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు దేవన్నగారి మల్లారెడ్డి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారని వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ సమావేశంలో మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. గోపి శంకర్, బి. మన్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story