నాయి బ్రాహ్మణ కులస్తులకు పెద్దపీట వేసిన కేసీఆర్ : కృష్ణ మోహన్ రెడ్డి

by Kalyani |   ( Updated:2023-11-27 15:47:46.0  )
నాయి బ్రాహ్మణ కులస్తులకు పెద్దపీట వేసిన కేసీఆర్ : కృష్ణ మోహన్ రెడ్డి
X

దిశ, గద్వాల ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం లో నాయి బ్రాహ్మణ కులస్తులకు కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుని వారికి ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో నాయి బ్రాహ్మణ కులస్తుల ఆత్మీయ సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా నాయి బ్రాహ్మణ జిల్లా కార్యవర్గం కృష్ణ మోహన్ రెడ్డి కి గజమాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … నాయి బ్రాహ్మణ సంఘస్తులు అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారనీ, దైవభక్తితో పాటు, సేవా గుణం ఉన్న గొప్ప వ్యక్తిత్వం గల వారు నాయి బ్రాహ్మణులు అని కొనియాడారు. వారి అభివృద్ధి కొరకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, ఏ పార్టీ లు కూడా నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పించలేదని బీఆర్ఎస్ పార్టీ మాత్రం నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పిస్తూ మేనిఫెస్టో లో 250 యూనిట్లు ఉచితంగా ఇస్తామని ఎన్నికల్లో చెప్పడం జరిగిందినీ చెప్పిన మాట ప్రకారం ప్రతి నాయి బ్రాహ్మణ షాపులో ప్రతి ఒక్కరికి 250 యూనిట్ల ఉచిత కరెంటు ను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని పేర్కొన్నారు.

భవిష్యత్తులో అన్ని విధాలుగా నాయి బ్రాహ్మణులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ నెల 30 తేదీ నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారిని అభ్యర్థి కోరారు. ఈ కార్యక్రమంలో భగీరథ వంశీ, గట్టు మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు, వ్యవసాయ మార్కెట్ యార్డు డైరెక్టర్ సవారన్న, శ్రీను, బీఆర్ఎస్ పార్టీ నాయకులు విక్రమ్ సింహారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు జానకీ రాములు, కురుమన్న , నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు భజంతి బలరాం, ఆలూరు ప్రతాప్, గోవర్ధన్, రాంగోపాల్, దేవేందర్, శివ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed