కులగణన సర్వేలతో బడుగులకు న్యాయం : మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య

by Aamani |
కులగణన సర్వేలతో బడుగులకు న్యాయం : మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య
X

దిశ,గద్వాల ప్రతినిధి : ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కుల గణన సర్వే చేపట్టడం జరుగుతుందని, దేశానికే ఈ సర్వే ఆదర్శం కానున్నదని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య తెలిపారు. శనివారం ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..... తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల గణన సర్వే చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయమని,ఈ సర్వే ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు కుల గణన సర్వే పై విమర్శలు చేస్తున్నారని రాజకీయం కోసమే వారు విమర్శిస్తున్నారని అన్నారు. భవిష్యతు లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నెరవేరుస్తామని ఆమె తెలిపారు.

గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా నిధులు తెచ్చి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతామ్మన్నారు. గద్వాల పట్టణం లో వున్నా ఐ టీ ఐ కళాశాల నిర్మాణం త్వరలో లోనే పూర్తి చేస్తామని, నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు బ్యాంక్ ల ద్వారా శిక్షణ ఇప్పించి ఎం ఎస్ ఎం ఈ ద్వారా ఉపాధి కలిపిస్తామన్నారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత గౌరవం ఇవ్వడానికి ప్రత్యేక మహిళా సభ్యత్వం చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, నగర అధ్యక్షులు ఇస్సాక్, మధు బాబు, డీటీడీసీ నరసింహ, లక్ష్మణ్, భాస్కర్ యాదవ్, పెద్దోడి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed