- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు
దిశ, మద్దూరు: నారాయణపేట జిల్లా సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఖాజీపూర్ సర్పంచ్ వీరారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లోకి గురువారం పార్టీ మారారు. గతంలో సర్పంచులకు గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు రావడం లేదని, పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు వీరారెడ్డి సమక్షంలో నారాయణపేట కలెక్టరేట్ ముట్టడి చేపట్టగా అప్పట్లో అధికార పార్టీ సర్పంచులు సైతం కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొనడంతో చర్చనీయాంశం అయ్యింది. జిల్లాలోని ఎమ్మెల్యేలు సైతం వారి పరిధిలోని సర్పంచులను బుజ్జగించిన వారికి పెండింగ్ బిల్లులు రాలేదు. తాజాగా వీరారెడ్డి చేరిక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశం అయ్యింది. ఈయనతో పాటు మద్దూరు రైతు సమన్వయ సమితి నెంబర్ చెన్నారెడ్డి, పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.