ప్రజావాణికి వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్

by Kalyani |
ప్రజావాణికి వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ అన్నారు. సోమవారం ఐ.డి.ఓ.సి సమావేశం హాల్ లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చిన ప్రజా పిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...జిల్లాలో వివిధ ప్రాంతల నుంచి భూ సమస్యలపై 93, ఇతర సమస్యలకు సంబంధించి 57, మొత్తం 150 దరఖాస్తులు సమర్పించారని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో దరఖాస్తుదారులకు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు. ప్రజా ఫిర్యాదులను జిల్లా అధికారులు సంబంధిత మండలాల తహశీల్దార్లు పెండింగ్ ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story