- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కులాంతర వివాహం.. కుల బహిష్కరణ చేసిన పెద్దలు
దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: ఇతర కులానికి చెందిన మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడని గ్రామంలో నిర్వహించే కులదైవం పండగకు వచ్చేది లేదని కుల పెద్దలు ఆ జంటను కుల బహిష్కరణ చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంధ్రకల్ గ్రామంలో చోటుచేసుకుంది. ఇంద్రకల్ గ్రామానికి చెందిన బాగాండ్రా భరత్ గత 16 ఏళ్లుగా తల్లిదండ్రులతో కలిసి బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో నివాసం ఉంటున్నారు. కాగా గత రెండేళ్ల క్రితం కుటుంబ పెద్దలను ఒప్పించి వారి సమక్షంలోనే కులాంతర వివాహం చేసుకున్నారు.
అయితే సొంత గ్రామంలో ఈ నెల 20 నుంచి కులదైవం బీరప్ప పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయి. కాగా వంశపారంపర్యంగా హక్కుగా పొందే బండారు, దైవ దర్శనానికి దూరంగా ఉండాలని కుల పెద్దలు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేదంటే కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చి గుడిలోకి కాలు పెట్టాలని అల్టిమేటం జారీ చేశారని మండిపడ్డారు. కొందరు రాజకీయ నేతలు రాజకీయ లబ్ధి కోసం తెరవెనుక కుల పెద్దలకే మద్దతు తెలిపి రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. దీనిపై తాడూరు మండల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.