- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల్లో పెరిగిన ఖర్చులు, ఓటు రేటు.. అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెంచిన షాడో టీమ్స్
దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: ఎన్నికలంటేనే ఐదేళ్లకు ఒక్కసారి అభ్యర్థి తన అదృష్టాన్ని పరీక్షించుకునే ఒక యజ్ఞం లాంటిది. ప్రతిసారి లాగే ఈసారి ఖర్చులు బాగానే పెరిగాయి. దానికి తోడు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల సరలితో ఓటు రేటుతోపాటు ఎన్నికల ఖర్చు రేట్లు కూడా రెట్టింపు అయ్యాయి. కానీ ఎన్నికల నిబంధన ప్రకారం.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ వేసిన నాటి నుంచి ఎన్నికలు జరిగే వరకు 40 లక్షలకు పైగా ఖర్చు చేస్తే తన అభ్యర్థిత్వం రద్దయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు ఆచితూచి ఖర్చు చేయాలని భావిస్తున్నారు. కానీ ఓటర్లలో ఎన్నికల సరళిలో జరిగిన మార్పుల నేపథ్యంలో ఖర్చుకు వెనకాడితే గెలుపోటములపైనే ప్రభావం చూపే ప్రమాదం ఉందని అభ్యర్థులు దొంగ చాటుగా ఖర్చులు పెడుతున్నారు. కొన్ని సెగ్మెంట్లలో ఎన్నికల అధికారులను సైతం మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నామినేషన్ వేసిన నాటి నుంచి అభ్యర్థులు సొంతంగా ఎన్నికల ఖర్చు కోసం కొత్త అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
ఖర్చుల వివరాలను కేవలం ఆ అకౌంట్ నుంచే లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. కానీ అభ్యర్థులు సంబంధిత అధికారుల వద్ద లోపాయికారి ఒప్పందం జరుపుకొని ఇతర అకౌంట్లలో లావాదేవీలు జరిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఖర్చుల వివరాలు కాకి లెక్కలు చెప్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో నామినేషన్ వేసిన నాటి నుంచి అభ్యర్థులు ఆయా గ్రామాలు మండలాల్లో ప్రచార రథాలను తిప్పుతున్నా నేటికీ దరఖాస్తు కూడా చేసుకోలేదని తెలుస్తోంది. నాగర్ కర్నూల్ బిఅర్ఎస్ 11, కాంగ్రెస్ 7, జనసేనా 5 వాహనాలు, అచ్చంపేట బీఅర్ఎస్ 2, కాంగ్రెస్ 20, బీజేపీ 10, డిఎస్పి 1, కల్వకుర్తిలో బీఅర్ఎస్ 19, కాంగ్రెస్ 16, బీఎస్పీ 3, డిఎస్పి ఒకటి, బీజేపీ 15 వాహనాలకు అనుమతిని పొందారు.
ఎన్నికల ఖర్చు వివరాలు ఇలా..
ఐదేళ్లకు ఒకసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామాల్లోని గడపగడపకు తిరిగి ఓటును అభ్యర్థించే పరిస్థితి ఏర్పడింది. తాజా ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీ అభ్యర్థులు నువ్వా నేనా అన్న స్థాయిలో తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఓటర్ను ఆకట్టుకునేలా తన వెంట భారీ స్థాయిలో జన సమీకరణ పోగు చేయాల్సిన పరిస్థితి. దీంతో ఉదయం నుండి రాత్రి వరకు ఓటరు బాగోగులు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక్కో అభ్యర్థికి ప్రతిరోజు వెయ్యికి పైగా ఖర్చు వస్తుంది. కానీ ఇవన్నీ అధికారికంగా లెక్కలు చూపకపోవడం విశేషం. ఇలాంటి వారిని సైతం ఎన్నికల సంఘం వదిలిపెట్టేది లేదంటూ వీరిని ప్రతిక్షణం గమనిస్తూ సభలు సమావేశాలు జరిపిన స్థలాల్లో ఎన్నికల కమిషన్ నియమించిన షాడో టీంలు తిరిగి ఖర్చులు వివరాలను నమోదు చేయనున్నాయి. దీంతో అభ్యర్థులు ఎన్నికల ఖర్చు 40 లక్షలకు దాటితే పరిస్థితి ఏంటి అంటూ ఆందోళన పడుతున్నారు. ఓటర్లను ఒక దగ్గర నుంచి మరొక చోటికి తరలించేందుకు వినియోగించే వాహనాల ఖర్చులు చాయ్, బిస్కెట్ వాటర్ ప్యాకెట్, పులిహోర, సమోసాలు, గ్లాస్ చివరికి భోజనం ప్లేట్లు ధరలు కూడా ఎన్నికల ఖర్చులోనే పొందుపరచాల్సి ఉంటుంది.
దీంతోపాటు ప్రచారం కోసం వినియోగించే వాహనాలు, ఎల్ఈడి స్క్రీన్, విద్యుత్, శ్యామ్యానాలు, కుర్చీలు, జనరేటర్స్, ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్, డ్రోన్ కెమెరాలు వాటన్నింటినీ ఎన్నికల ఖర్చు వివరాల్లోనే బయట మార్కెట్లో పొందే ధరలకే పొందుపర్చాల్సి ఉంటుంది. సభలు సమావేశాలు ర్యాలీల్లో వాడే జెండాలు, కండువాలు, టోపీలు, వాల్ స్టిక్కర్స్ మైక్ సెట్ తోపాటు కళాకారులు డప్పు, డోలు, కోలాటం వంటి వాటితో పాటు కూలీల ఖర్చుల వివరాలను కూడా పొందుపరచాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం అభ్యర్థులు ఏర్పాటు చేసుకున్న ప్రచార రథాలకే 10 లక్షల పైగా ఖర్చు అవుతున్నాయి. ఈ లెక్కన అభ్యర్థి ఎన్నికల నాటికి ఖర్చులు కోట్లకు పైగా అవుతున్నాయి. దీంతో ఎన్నికల ఖర్చులపై అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. దీనికి తోడు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ సోషల్ మీడియాలోనూ ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో వాటి వివరాలు కూడా ఎన్నికల ఖర్చులకే వస్తున్నాయి. వీటన్నింటిని ఎన్నికల అధికారులకు కాకి లెక్కలు చెబుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.