సుస్థిర పాలన సాధనకు కృషి చేస్తాను : మిథున్ రెడ్డి

by Kalyani |   ( Updated:2023-10-28 15:07:55.0  )
సుస్థిర పాలన సాధనకు కృషి చేస్తాను :  మిథున్ రెడ్డి
X

దిశ,మహబూబ్ నగర్: ఆదికవి మహర్షి వాల్మీకి రాసిన తొలి గ్రంథం రామాయణం అని,రాముడి పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని,అలాంటి రామరాజ్య సుస్థిర పాలనకై తన వంతుగా కృషి చేస్తానని బీజేపీ పాలమూరు ఎమ్మెల్యే అభ్యర్థి మిథున్ రెడ్డి అన్నారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకీ చిత్ర పటానికి ఆయన పూల మాలతో పూజ నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీ కి చేసిన సేవలను గుర్తించి పాలమూరు అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం,మహర్షి వాల్మీకి జయంతి రోజు పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టడం ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని,ఆయన స్ఫూర్తితో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.పాలమూరు ప్రజల దీవెనలు,నాన్న జీతేందర్ రెడ్డి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ.జితేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మాచార్య, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు నాగురావ్ నామాజీ, పడాకుల బాల్ రాజ్, పి.శ్రీనివాస్ రెడ్డి, అంజయ్య, సతీష్ కుమార్, కె.దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.అంతకుముందు ఆయన స్వగృహం నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Next Story