- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇదెక్కడి సినిమా లెవల్ ట్విస్ట్ రా..ప్రేమ కోసం పారిపోయిన గురుకుల విద్యార్థి..చివరికి ఏమైందంటే..?
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: పోటీ పరీక్షలలో పాల్గొనడానికి వెళ్లిన ఓ విద్యార్థి అక్కడ పరిచయమైన అమ్మాయితో మాటామంతి కలిపాడు. అదే ప్రేమ అనుకున్నాడో ఏమో.. ఆ అమ్మాయిని వెతుకుంటూ విద్యార్థి వెళ్లిపోయిన ఘటన కోయిలకొండ బీసీ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..వనపర్తి జిల్లా పెద్దమందడి మండలానికి చెందిన ఓ విద్యార్థి మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండల కేంద్రంలో ఉన్న బీసీ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల ఒక సంస్థ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించింది. ఈ పోటీలలో పాల్గొనడానికి గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు వచ్చారు. అదే పోటీలకు జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలకు చెందిన విద్యార్థిని వచ్చింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటలు కలిశాయి. ఒకరి ఫోన్ నెంబర్ మరొకరు ఇచ్చి పుచ్చుకున్నారు. పాఠశాలకు చేరుకున్న విద్యార్థి తన తోటి మిత్రులతో ఆ అమ్మాయిని చూడకుండా ఉండలేకపోతున్నాను..ఎలాగైనా ఆమె ఎక్కడ ఉంటుందో కనిపెడతాను..రాత్రులలో నిద్ర రావడం లేదు అంటూ తన మిత్రుల దగ్గర చెప్పుకున్నట్లు సమాచారం. ఆదివారం రోజు మిగతా విద్యార్థులు ఆటలు ఆడుకుంటూ ఉండగా..ఇదే అదునుగా భావించి గురుకుల నుండి వెళ్లిపోయాడు. సాయంత్రము ఆటలు ముగిసిన తర్వాత రోజువారి మాదిరిగానే హాజరు తీసుకుంటున్న క్రమంలో ఆ విద్యార్థి లేడు అన్న విషయాన్ని సిబ్బంది గుర్తించారు. అటు ఇటు వెతికిన ప్రయోజనం లేకపోయింది. సోమవారం ఉదయం ప్రిన్సిపల్, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి చేరుకొని ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని మా పిల్లవాడు ఎక్కడికి పోయాడు అంటూ సిబ్బందిపై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. ఈ క్రమంలో విద్యార్థి పుస్తకాలు బట్టలు ఉండే పెట్టెను తెరిచి చూశారు. అందులో ఆ విద్యార్థి అమ్మ నాన్న క్షమించండి.. ఫ్రెండ్స్ సారీ .. నేను ఆ అమ్మాయిని మరువలేక పోతున్నాను. ఆమెను కలుసుకోవడానికి వెళుతున్నాను అంటూ రాసిన లేఖ లభ్యం అయింది. సమీపంలో ఉన్న సిసి కెమెరాలను పోలీసులు పరిశీలించగా..ఆదివారం 4. 40 నిమిషాల సమయంలో పాఠశాల నుండి వెళుతున్నట్లుగా గుర్తించారు. పోలీసులు ఆ విద్యార్థిని ఇంటికి వెళ్లి అడుగగా.. నేను క్యాజువల్ గా మాట్లాడాను.. ఫోను నంబరు ఇచ్చిపుచ్చుకున్నది నిజమే.. కానీ నాకు ఎటువంటి ఆలోచనలు లేవు. అతను నాకు ఫోను కూడా చేయలేదు అని విద్యార్థిని చెప్పినట్లు సమాచారం. ఆ విద్యార్థిని కాల్ డేటా పరిశీలించినప్పటికిని ఆ నంబరుకు ఫోన్ రాలేదు అని పోలీసులు గుర్తించారు. మరి పాఠశాల నుండి వెళ్లిన విద్యార్థి ఎక్కడికి వెళ్ళాడు..!? ఏమి అయ్యాడు అన్న విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ మేరకు కోయకొండ ఎస్సై భాస్కర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.