ఉచిత శిక్షణకు దరఖాస్తులు స్వీకరణ

by Kalyani |
ఉచిత శిక్షణకు దరఖాస్తులు స్వీకరణ
X

దిశ, సిద్దిపేట అర్బన్ : యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సిద్దిపేట వారి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్దిపేట రీజినల్ హెడ్ ఎద వికాస్ తెలిపారు. ఈనెల 10-01-2025 నుంచి బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ (30 రోజుల( స్త్రీలకు) పుట్టగొడుగుల తయారీ (Mashroom Cultivation) (స్త్రీ, పురుషులకు) పై ఉచిత ఇవ్వనున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధిపేట రీజినల్ హెడ్ ఎద వికాస్, సంస్థ డైరెక్టర్ శ్రీ రాజ లింగం సంయుక్తంగా పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ ఉచిత శిక్షణ కార్యక్రమంలో ఉచిత ఉచిత కోర్సు మెటీరియల్, యూనిఫాం, ఉదయం టిఫిన్, రెండు సార్లు టీ, మధ్యాహ్నం, రాత్రి భోజనం సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన తర్వాత సర్టిఫికెట్ ప్రధానం చేయబడును. అర్హత ఉన్న వారికి బ్యాంకు లోను కు సహకరిస్తామని తెలిపారు. ఆసక్తి కలిగి ఉన్న సిద్దిపేట గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 18 నుంచి 45 సంవత్సరాలు ఉన్న పురుషులు/మహిళలు తమ

1)ఆధార్ కార్డు,

2)రేషన్ కార్డు,

3) 3 ఫోటోలు,

4)బ్యాంకు పాస్ బుక్, ఏదైనా చదువుకున్న ద్రువపత్రాలు

అన్ని జిరాక్స్ పత్రలు 10-01-2025 లోపు వీపంచి కళా నిలయం పక్కన, జిల్లా గ్రంథాలయం ఎదురుగా ఉన్న యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి సిద్ధిపేట కార్యలయంలో నేరుగా వచ్చి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఇతర వివరాలకు:

9949 88 2026*9966 829 102

సంప్రదించగలరని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed