- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నూతన సంవత్సరంలో జిల్లాను ముందంజలో నిలుపుదాం : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
దిశ ప్రతినిధి,నిజామాబాద్ : నూతన సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా మరింత ప్రగతి సాధించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో జిల్లాను ముందంజలో నిలిపేందుకు అందరూ సహకరించాలని కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరెట్) లోని కలెక్టర్ ఛాంబర్ లో గురువారం వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల బాధ్యులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు జిల్లా పాలనాధికారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తాహెర్ బిన్ హందాన్ నేతృత్వంలో ఆఫీసర్స్ క్లబ్ కార్యవర్గం, రెడ్ క్రాస్ సొసైటీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, బ్రహ్మకుమారీలు తదితరులు కలెక్టర్ ను కలిసి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రకటించారు. ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని, అనుకున్న కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని, పంటలు సమృద్ధిగా పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, జిల్లాను మరింత సుసంపన్నం చేసేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని కలెక్టర్ పిలుపునిచ్చారు.
విద్యార్థుల కోసం దుప్పట్లు, నోట్ బుక్కులు అందజేత..
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన అధికార, అనధికార ప్రముఖులు, వివిధ సంఘాల వారు అందించిన దుప్పట్లు, నోట్ బుక్కులు, ఎగ్జామ్ ప్యాడ్లు , పెన్నులను స్వీకరించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వాటిని సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు అందజేస్తామని అన్నారు. పూల బొకేలు, శాలువాలకు బదులుగా పేద విద్యార్థులకు అందించేందుకు వీలుగా బ్లాంకెట్లు, నోట్ బుక్కులు తేవాలని కలెక్టర్ చేసిన విజ్ఞప్తికి విశేష స్పందన లభించింది. పాలనాధికారిని కలిసేందుకు వచ్చిన వారందరు పెద్ద ఎత్తున దుప్పట్లు, నోట్ బుక్కులు తీసుకురాగా, కలెక్టర్ వాటిని వసతి గృహాల విద్యార్థులకు పంపిణీ చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. నూతన సంవత్సరం సందర్భంగా విద్యార్థులకు తోడ్పాటును అందించిన వారందరికీ జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వసతి గృహాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, ప్రస్తుత చలికాలం బారి నుంచి రక్షణ పొందేందుకు దుప్పట్లు ఉపయుక్తంగా నిలుస్తాయని పలువురు హర్షం వెలిబుచ్చారు.