గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఎఫెక్ట్.. AMB సినిమాస్ దగ్గర భారీగా పోలీసులు, బౌన్సర్ల బందోబస్తు

by Mahesh |   ( Updated:2025-01-02 15:49:33.0  )
గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఎఫెక్ట్.. AMB సినిమాస్ దగ్గర భారీగా పోలీసులు, బౌన్సర్ల బందోబస్తు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట(Stampede) ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం, పోలీసులు.. గేమ్ చేంజర్(Game changer) ట్రైలర్ లాంచ్ ఈవెంట్(Trailer launch event) సందర్భంగా.. AMB సినిమాస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ప్రోగ్రామ్‌ కు హీరో రామ్ చరణ్, ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి, శంకర్, తమన్, హీరో శ్రీకాంత్, హీరోయిన్ అంజలి వస్తుండటంతో పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో AMB సినిమాస్ దగ్గర పోలీసులు(Police), బౌన్సర్ల(Bouncers)తో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. తీవ్ర ఆంక్షలు పెట్టారు. అలాగే ఫ్లెక్సీలు, హోర్డింగులు ఎలాంటి హడావుడి కేవలం టికెట్ ఉన్న వారికే అనుమతి ఇచ్చారు. దీంతో గేమ్ చేంజర్ ట్రైలర్ ఈవెంట్(game changer trailer event) ప్రశాంతంగా ముగిసింది.

Read More ....

‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ విడుదల.. అంచనాలకు మించిపోయిందిగా.. (వీడియో)


Advertisement

Next Story

Most Viewed