నిర్మాణం పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలి : ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త

by Aamani |
నిర్మాణం పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలి :  ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో అమృత్ 2 పథకం కింద నిజామాబాద్ నగరంలో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మ్యాన్ హోల్స్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు.వాటర్ వర్క్స్, వాటర్ ట్యాంకుల నిర్మాణం పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని తెలిపారు. నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం పబ్లిక్ హెల్త్ అధికారులు అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో ఎమ్మెల్యే ధన్ పాల్ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమృత్ 2 నిధులతో చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు సూచించారు. అమ్మ వెంచర్ లో బ్రిడ్జ్ నిర్మాణం అయినప్పటికీ చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉండటంతో ప్రారంభానికి నోచుకోపోవడంపై అసహనం వ్యక్తం చేసారు త్వరతగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.

టీయూఎఫ్ఐడీసీ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 60 కోట్లు, డివిజన్ కి రూ. 1 కోటి నిధులతో త్వరతగతిన టెండరింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజావసరాలకు అనుగుణంగా చేపట్టే పనులు అధికారులు, కాంట్రాక్టర్లు చిత్తశుద్ధితో పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఈ ఈ తిరుపతి రెడ్డి, డీఈ నగేష్, సిబ్బంది ఏఈఈ లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed