- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిజాలు నిర్భయంగా రాయండి : కలెక్టర్
దిశ, ఇబ్రహీంపట్నం: ప్రజా సమస్యల పరిష్కారంలో పత్రిక రంగం ముందంజలో ఉండాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో గురువారం దిశ దిన పత్రిక క్యాలెండర్ ను కలెక్టర్ నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆధారాలతో నిజాలను నిర్భయంగా వ్రాయాలని అన్నారు. అలాంటప్పుడే పత్రిక ప్రాధాన్యత పెరుగుతుందని తెలిపారు. దిశ దినపత్రిక అనతికాలంలో ప్రజలకు దగ్గరైందని అన్నారు. అదే స్థాయిలో ప్రజా సమస్యలను ఎత్తిచూపడంలో ముందుందని వివరించారు. ప్రభావంతమైన పత్రికగా దిశ ఎదిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, రంగారెడ్డి బ్యూరో చీఫ్ చిలివేరు సురేష్, రిపోర్టర్స్ అబ్దుల్లాపూర్ మెట్టు శేఖర్ రెడ్డి, మహేశ్వరం ప్రశాంత్, మీర్పేట్ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.