దొంగతనానికి పాల్పడిన నిందితులు అరెస్ట్​

by Sridhar Babu |
దొంగతనానికి పాల్పడిన నిందితులు అరెస్ట్​
X

దిశ, భైంసా : దొంగతనానికి పాల్పడిన నిందితులను అరెస్ట్​ చేసినట్టు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఇటీవల భైంసా పట్టణ శివారు బోకర్ రోడ్లో గల నాగదేవత ఆలయంలో చోరీ చేసినట్టు తెలిపారు. భైంసా మండలం చూచుండ్ గ్రామానికి చెందిన గడపాలే సంగరతన్ , షానె విశాల్ అనే ఇద్దరు దుండగులు హుండి, ఆలయ గంటల దొంగతనానికి పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. పట్టణ ఓల్డ్ పోలీస్ స్టేషన్ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ సదరు నిందితులు జల్సాలకు అలవాటు పడి పథకం ప్రకారం నాగదేవత ఆలయంలో దొంగతనం చేశారన్నారు.

సీసీ కెమెరాలు, పోలీసుల సహకారంతో కేవలం 24 గంటల్లోనే దొంగతనం చేసిన నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నమన్నారు. వారి వద్ద కొంత సొత్తుని, గుడి గంటలను స్వాధీనపరుచుకొని రిమాండ్ కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ ప్రార్థనా స్థలాలు, వ్యాపార సముదాయాలు నివాసాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాటి వల్ల నేరాలను అదుపు చేయవచ్చని కోరారు. పెట్రోలింగ్ వ్యవస్థ బలోపేతం అయ్యిందని, 48 గంటల్లోనే దొంగతనం కేసును ఛేదించినట్టు చెప్పారు. చాకచక్యంగా వ్యవహరించిన భైంసా టౌన్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్, ఎస్ఐ శ్రీనివాస్,హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు. హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ జాదవ్, కానిస్టేబుల్స్ ప్రమోద్ కుమార్,అంబదాస్ కి రివార్డ్ అందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ అవినాష్ కుమార్, సీఐ, ఎస్ఐ లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed