Srisailam project : శ్రీశైలం ప్రాజెక్టు వద్ద భారీ ట్రాఫిక్ జాం..

by Sumithra |
Srisailam project : శ్రీశైలం ప్రాజెక్టు వద్ద భారీ ట్రాఫిక్ జాం..
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి పై తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మన్ననూరు, వటవర్లపల్లి దోమలపెంట, ఈగలపెంట, పాతాళగంగ అలాగే ఆంధ్రప్రదేశ్ వైపు కర్నూలు జిల్లా లింగాల గట్టు సున్నిపెంట శ్రీశైలం వరకు సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఓపెన్ కావడం, దాంతో పాటు వీకెండ్ కావడంతో రాష్ట్ర నలుమూలల నుండి కాకుండా పురుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున శ్రీశైలం వెళ్లే భక్తులు పకృతి ప్రేమికులు శ్రీశైలం ప్రాజెక్టు సహజసిద్ధ అందాలను తిలకిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో శ్రీశైలం వైపు నుండి హైదరాబాద్ వెళుతున్న అంబులెన్స్ ట్రాఫిక్ జామ్ లో దాదాపు గంటకు పైగా నిలవాల్సిన దుస్థితి ఏర్పడింది. అతి కష్టం మీద ట్రాఫిక్ ను తప్పించుకుంటూ అంబులెన్స్ వెళ్ళింది.

28 కి.మీ దూరం సుమారు 10 గంటల ప్రయాణం...

శ్రీశైలం జాతీయ రహదారి పై భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో దోమలపెంట చెక్పోస్ట్ నుండి శ్రీశైలం దేవస్థానం వరకు 28 కిలోమీటర్ల దూరం సుమారు పది గంటల ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ అత్యవసర సేవలు ఏర్పడితే పరిస్థితి విషమించాల్సిందేనని ఈ ప్రాంత ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed