ఉమ్మడి పాలమూరు‌ను అతలాకుతలం చేస్తున్న వర్షం

by Mahesh |
ఉమ్మడి పాలమూరు‌ను అతలాకుతలం చేస్తున్న వర్షం
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లా అతలాకుతలం అవుతోంది. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం ఎక్క మేడు గ్రామంలో ఇల్లు కూలిపోయిన సంఘటనలో తల్లి కూతుళ్లు హనుమమ్మ (78), అంజిలమ్మ (38) మృతి చెందారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు మండలాలలో ఇండ్లు నేలమట్టం అయ్యాయి. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ ఎత్తున వరద వస్తుండడంతో 45 గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. సరళ సాగర్‌కు వరద తీవ్రత పెరగడంతో ఆటోమేటిక్ సైఫాన్ సిస్టం గేట్లు తెచ్చుకోవడంతో వరద దిగువ ప్రాంతాలకు పరుగులు పెడుతుంది. కోయిల్ సాగర్ పూర్తిగా నిండడంతో 11 గేట్లు ఎత్తివేశారు. భూత్పూర్ రిజర్వాయర్ పూర్తిగా నిండడంతో గేట్లు ఎత్తారు.

Advertisement

Next Story

Most Viewed