భారీ వర్షం.. నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన గ్రామస్తులు

by Kavitha |
భారీ వర్షం.. నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన గ్రామస్తులు
X

దిశ, ఊట్కూర్ : మండలంలో భారీ వర్షాల కారణంగా చెరువులు అలుగులు పారడంతో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఊట్కూర్ నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారి, మండలంలోని కర్ణాటక తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో సమిస్తా పూర్ చిన్న వాగు, పగిడి మారి, నారాయణపేట, సామనూర్, అమీన్ పూర్, తిప్రస్ పల్లి బాపుర్, వెల్లంపల్లి, పెద్దపొర్ల, మల్లేపల్లి, బిజ్వార్, పెద్ద జట్రం వంటి గ్రామాలలో వాగులు, చెరువులు నీటి ఉధృతికి రాకపోకలు నిలిచిపోయి తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. కంటిన్యూగా వర్షం కురుస్తుండడంతో వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉంది.

అమీన్‌పూర్ సామనుర్ గ్రామాల మధ్య ఉన్న వాగు ప్రవాహానికి కర్ణాటక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు వాగులో పడిపోగా.. అమీన్‌పూర్ గ్రామస్తులు తాడు వేసి ఆ వ్యక్తిని పెను ప్రమాదం నుంచి కాపాడారు. మండల కేంద్రంలోని రుద్రా నగర్ వీధిలో ఆదివారం తెల్లవారుజామున చెట్టు కూలి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో అక్కడి విద్యుత్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో మండల అధికారులు ప్రమాదకరంగా ఉన్న వరద నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed