Godavari : జీవనదిలో గరళం.. అపరిశుభ్రంగా మారిన గోదావరి...

by Sumithra |
Godavari : జీవనదిలో గరళం.. అపరిశుభ్రంగా మారిన గోదావరి...
X

పవిత్ర గోదావరి నది అపవిత్రంగా మారుతోంది. ఒకప్పుడు జీవనదిగా విలసిల్లిన గోదావరి కలతప్పి కలుషిత నదిగా మారింది. ప్రస్తుతం అపరిశుభ్రంగా మారి పరిసర ప్రాంతాలు కంపు కోడుతూ దుర్గంధం వెదజల్లుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతానికి తాగునీరు అందించి ఆదుకున్న నది కలుషితంగా మారడం ఈ ప్రాంత ప్రజలను కలవరపెడుతోంది. అయితే కార్మిక క్షేత్రానికి తాగు నీటికి గోదావరి నదే ప్రధాన ఆధారం. దీంతో ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలు కలుషిత నీటితో బతకడమా ? చావడమా ? అంటూ పాలకులను ప్రశ్నిస్తున్నారు. గోదావరి నదిలో విషపూరిత పదార్థాలు చేరడంతో కలుషితం అయినప్పటికీ సంబంధిత శాఖల అధికారులు, స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా శాఖల అధికారులు అసలు ఉన్నారా లేరా అనే అనుమానాలు వ్యక్తం వస్తున్నాయి. పొల్యూషన్ బోర్డ్ నియంత్రణ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ నిర్లక్ష్యం చేయడం వారికి అలవాటుగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు.

దిశ, గోదావరిఖని : పవిత్ర గోదావరి నది ( Godavari ) అపవిత్రంగా మారింది. ఒకప్పుడు జీవనదిగా విలసిల్లిన గోదావరి నది కలతప్పి కలుషిత నదిగా మారింది. ప్రస్తుతం అపరిశుభ్రంగా మారి పరిసర ప్రాంతాలు కంపు కోడుతూ దుర్గంధం వెదజల్లుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతానికి ( Industrial area ) తాగునీరు అందించి ఆదుకున్న నది కలుషితంగా మారడం ఈ ప్రాంత ప్రజలను కలవరపెడుతోంది. అయితే కార్మిక క్షేత్రానికి తాగు నీటికి గోదావరి నదే ప్రధాన ఆధారం. దీంతో ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలు కలుషిత నీటితో బతకడమా? చావడమా? అంటూ పాలకులను ప్రశ్నిస్తున్నారు.

జీవచ్చావంలా జీవనది..

జీవనదిగా ప్రఖ్యాతి గాంచిన గోదావరి నది పై పాలకులు నిర్మించిన ప్రాజెక్టులు ఆ నదిని జీవచ్చవంలా మార్చేశాయి. ఒకప్పుడు పవిత్రతకు మారుపేరుగా నిలిచిన గోదావరి నది పరిసర ప్రాంత ప్రజలు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచి శుభ, అశుభ కార్యక్రమాలకు గోదావరి నీటిలో స్నానం ఆచరించి పుణ్యస్నానంగా భావించే ఆచారం ఈ నదికి ప్రత్యేకం. అలాంటి గోదావరి నది కాలక్రమేణా ఇప్పుడు పారిశ్రామిక ప్రాంతం ( projects ) నుంచి వెలువడుతున్న కాలుష్యాలు గోదావరిలో పేరుకుపోయి పరిసర ప్రాంతాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. గోదావరి పరిసర ప్రాంతం కలుషిత కోరల్లో చిక్కుకున్న గోదావరి నీరే ఆ ప్రాంతానికి ప్రధాన వనరు కావడంతో ఆ నీటిని తాగేందుకు జంకుతున్నారు. జీవనదిని కాపాడాలని పరిసర ప్రాంతాల ప్రజలు వేడుకుంటున్నారు.

ఫ్యాక్టరీల వ్యర్థాలతో దుర్గంధం..

గోదావరి నదిలోనికి చుట్టు పక్కల ఉన్న ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్ధాలతో విషపూరితంగా మారుతోంది. ముఖ్యంగా ఆర్ఎఫ్‌సీఎల్ నుంచి వచ్చే విషపూరితమైన వ్యర్ధాలతో గోదావరి నది జలాలు కాలుష్యం అవుతున్నాయి. గోదావరి నదిలోకి విషపూరితమైన కలుషిత నీరు చేరడంతో నది జలాలు మురికి మారాయి. దీంతో గోదావరి నదిలో ఉన్న చేపలు, జలచరాలు నీటిని తాగి చనిపోతున్నాయి. వీటితో పాటు ప్లాస్టిక్ డబ్బాలు, చెత్తతో గోదావరి నది కలుషితంగా మారింది.

పట్టించుకోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు..

గోదావరి నదిలో విషపూరిత పదార్థాలు చేరడంతో కలుషితం అయినప్పటికీ సంబంధిత శాఖల అధికారులు, స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదు. ఆయా శాఖల అధికారులు అసలు ఉన్నారా లేరా అనే అనుమానాలు వ్యక్తం వస్తున్నాయి. పొల్యూషన్ బోర్డ్ నియంత్రణ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ నిర్లక్ష్యం చేయడం వారికి అలవాటుగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు.

కలుషిత నీరే సరఫరా...

వ్యర్థ పదార్థాలతో కలుషితమైన గోదావరి నది కలుషిత జలాలను సింగరేణి కార్మికుల కుటుంబాలకు సింగరేణి సంస్థ పై మంచినీరుగా చేస్తుంది. గోదావరి నది నీటి పై ఎలాంటి శ్రద్ధ చూపించకుండా సింగరేణి కార్మికుల కుటుంబాలకు మురుగు నీరును అందిస్తున్నారు. సింగరేణి కార్మికులు ఆ నీరు తాగి అనారోగ్యాల పాలవుతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. గోదావరి నది కలుషితం పై పొల్యూషన్ కంట్రోల్ అధికారులు, జిల్లా కలెక్టర్ అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మద్దెల దినేష్ ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed