- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Iran- Israel: ఇరాన్ పై మిసైల్స్ తో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార(Israel attacks Iran) దాడులకు పాల్పడింది. శనివారం తెల్లవారుజామ నుంచి కొన్ని గంటల పాటు టెహ్రాన్‌కు(Tehran) చెందిన సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు సాగించింది. ‘ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్ సైనిక స్థావరాలపై ఐడీఎఫ్ దాడులు చేస్తోంది. ఇరాన్ దాని మద్దతుదారులు అక్టోబరు 7 నుంచి ఇజ్రాయెల్‌పై దాడులతో విరుచుకుపడుతున్నారు. ప్రపంచంలోని అన్ని సార్వభౌమ దేశాల మాదిరిగానే ఇజ్రాయెల్‌కు ప్రతిస్పందించే హక్కు, బాధ్యత ఉంది. మా దేశాన్ని, ప్రజలను రక్షించుకునేందుకు ఏదైనా చేస్తాం’ అని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ పేర్కొన్నారు. మరోవైపు, జనరల్ స్టాఫ్ చీఫ్, ఎల్‌టీజీ హెర్జి హలేవీ నాయకత్వంలో ఈ ప్రతీకార దాడులు చేస్తున్నట్లు ఐడీఎఫ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ అధికారి మేజర్ జనరల్ టోమర్ బార్‌తో కలిసి క్యాంప్ రాబిన్‌లోని ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్ కమాండ్ సెంటర్ నుంచి దాడులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.
మిసైల్స్ తయారీ కేంద్రాలపై దాడి
అంతేకాకుండా ఇరాన్ సైనిక స్థావరాలతో పాటు మిసైల్స్ తయారీ కేంద్రాలపై ఐడీఎఫ్ దాడులు చేసింది. ‘‘ఈ మిసైల్స్ తో ఇరానియన్లకు ముప్పు ఉంది. అందుకే వాటిని ధ్వంసం చేశాం’’ అని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ప్రస్తుతానికి ఇరాన్‌పై తమ దాడులు ముగిసినట్లే అని తెలిపింది. అయితే, ఈ దాడుల కారణంగా టెహ్రాన్‌లో ఎంత నష్టం వాటిల్లిందన్న దానిపై స్పష్టత లేదు. ఇకపోతే, ఈ ఏడాది అక్టోబరు 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిసైల్స్ తో విరుచుకుపడింది. హిజ్ బొల్లాపై దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ పై టెహ్రాన్ దాడులు చేపట్టింది. ఆ దాడులు ప్రతీకారం తీర్చుకుంటామన్న నెతన్యాహు ప్రభుత్వం.. మిసైల్స్ తో విరుచుకుపడింది. ఇకపోతే, ఇజ్రాయెల్ దాడుల్లో అమెరికా ప్రమేయం లేనట్లు తెలుస్తోంది. ఇరాన్ పై దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడుల్లో వాషింగ్టన్ ప్రమేయం లేదని అమెరికాకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. అయితే ఇరాన్‌పై ప్రతీకార దాడులకు సంబంధించి అమెరికాకు ముందే సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.