అబ్బాయిలూ.. అమ్మాయిలతో జాగ్రత్త.. అలా చేశారో అంతే సంగతి !

by Rani Yarlagadda |   ( Updated:2024-10-26 05:21:28.0  )
అబ్బాయిలూ.. అమ్మాయిలతో జాగ్రత్త.. అలా చేశారో అంతే సంగతి !
X

దిశ, వెబ్ డెస్క్: వీకెండ్ పార్టీలు, పబ్బులు, బస్సులు, మెట్రో(Hyderabad Metro), ప్రజల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మహిళలు, యువతులను కొందరు ఆకతాయిలు కావాలనే అసభ్యంగా తాకుతుంటారు. తిరిగి అడిగితే అనుకోకుండా తగిలిందనో, రద్దీ ఎక్కువగా ఉండటంతో చూడలేదనో చెప్పొచ్చని అనుకుంటారు. అలాంటి వాళ్ల ఆటకట్టిస్తున్నాయి షీ టీమ్స్ (She Teams). మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. దొరికిందే ఛాన్స్ గా వారిని ఇష్టానుసారం తాకేవారిపై నిఘా పెట్టి మరీ అరెస్ట్ చేసి, వారి పనిపడుతున్నాయి. ఇప్పటి వరకూ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన 13,895 మందిని షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి.. మరోసారి ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరిస్తున్నాయి. అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నాయి. కాబట్టి అబ్బాయిలు.. అమ్మాయిలతో కాస్త జాగ్రత్తగా ఉండటం మీ శరీరానికి చాలా మంచిది.

Advertisement

Next Story

Most Viewed