Iran-Israel: ఇజ్రాయెల్ దాడులపై స్పందించిన ఇరాన్

by Shamantha N |
Iran-Israel: ఇజ్రాయెల్ దాడులపై స్పందించిన ఇరాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ (Iran) దాడులకు ప్రతీకారంగా ఆ దేశ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ (Israel) విరుచుకుపడింది. దీనిపై తాజాగా ఇరాన్ స్పందించింది. తమ దేశ సైన్యానికి చెందిన మూడు సైనిక స్థావరాలను ఐడీఎఫ్ (IDF) లక్ష్యంగా చేసుకుందని, ఈ దాడుల్లో పరిమిత స్థాయిలో మాత్రమే నష్టం వాటిల్లిందని వెల్లడించింది. శనివారం ఉదయం టెహ్రాన్ చుట్టూ "బలమైన పేలుళ్లు" జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఇజ్రాయెల్'దూకుడు చర్య'కు ఇరాన్ ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. ఇజ్రాయెల్ తీసుకునే ఏ చర్యకైనా తీవ్ర ప్రతిస్పందన ఎదుర్కొంటుంది అనడంలో సందేహం లేదంది. ఈ దాడులకు టెల్ అవీవ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని టెహ్రాన్ హెచ్చరించింది.

విమానక రాకపోకల నిలిపివేత

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల కారణంగా ఇరాక్‌ తన విమానాశ్రయాల్లో రాకపోకలను నిలిపివేసింది. ‘ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా, ఇరాక్‌ గగనతలంలో పౌర విమానయాన భద్రతను కాపాడేందుకు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు విమానాల రాకపోకలు నిలిపివేశాం’ అని దేశ రవాణాశాఖ మంత్రి ప్రకటనలో పేర్కొన్నారు. అటు ఇరాన్‌ కూడా తమ దేశంలో విమానాల రాకపోకలను నిలిపివేసింది.

Advertisement

Next Story

Most Viewed