Johnny Master: మనిషి అనే వాడు జైలుకు పోకూడదు.. నరకంలా ఉంది.. జానీ మాస్టర్ సంచలన కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-10-26 14:34:01.0  )
Johnny Master: మనిషి అనే వాడు జైలుకు పోకూడదు.. నరకంలా ఉంది.. జానీ మాస్టర్ సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Choreographer Johnny Master)పై తన అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసు జానీ జీవితాన్నే తారుమారు చేసేసింది. పరువు, గౌరవం, చాన్స్‌లు ఇలా అన్ని పోయాయి అనే చెప్పాలి. ఇక ఈ కేసులో జానీ మాస్టర్ జైలుకు కూడా వెళ్లాడు. అయితే జానీ మాస్టర్ భార్య బెయిల్(Bail) కోసం ప్రయత్నించగా మొదట బెయిల్ వద్దన్న ఆయన.. ఆ తర్వాత తన తల్లి అనారోగ్యం కారణంగా బయటకు రావాలని కోర్టు(Court)కు కోరాడు. అప్పుడు జానీ బెయిల్‌ను కోర్టు రద్దు చేసింది.

ఇక ఎంతో ప్రయత్నించగా.. శుక్రవారం జానీ మాస్టర్‌కు బెయిల్ వచ్చింది. సుమారు 36 రోజులు పాటు ఆయన చంచల్ గూడ జైల్లో(Chanchal Guda Jail) ఉన్న జానీ.. విడుదల తర్వాత నేరుగా ఇంటికి చేరుకుని ఓ ప్రముఖ డైరెక్టర్, కొందరు కొరియోగ్రాఫర్‌లతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జైలులో తనకెదురైన చేదు అనుభవాలను ఆయన పంచుకున్నట్లు తెలుస్తోంది.

జానీ మాస్టర్ మాట్లాడుతూ.. 'నాకు ఇంకా జైలులోనే ఉన్నట్లు అనిపిస్తోంది. అక్కడి ఫుడ్ తినలేక పోయాను. మనిషి అనేవాడు ఎప్పుడూ జైలుకు పోకూడదు. బయట కంటే జైల్లో నరకం ఉంటుంది. ఇది ఎలా జరిగిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. నేను నార్మల్ పరిస్థితికి రావాలంటే కొన్ని రోజులు పడుతుంది. రెండు రోజుల వరకు ఎవరితోనూ మాట్లాడను. ఇప్పట్లో మీడియా(media) ముందుకు వచ్చే ఆలోచన కూడా లేదు. కానీ త్వరలోనే అన్ని విషయాలు బయట పెడతాను' అని జానీ మాస్టర్ చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా రిలీజ్‌కు ముందు జానీ మాస్టర్.. ‘భూల్ భులయ్యా 3’(Bhool Bhulaiyaa 3) అనే హిందీ మూవీ లోని హరే రామ్.. హరే రామ్(Hare Ram.. Hare Ram) అనే టైటిల్ ట్రాక్‌కు కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్‌ను ట్రెండింగ్‌లో ఉంచినందుకు 'నా సాంగ్ స్పూకీ సైడ్‌ను ట్రెండింగ్‌లో ఉంచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు' అనే పోస్ట్ పెట్టి తన ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు.

Advertisement

Next Story