Adai: అల్ఫాహారంగా గుమ్మడి అడై.. మార్నింగ్ తిని చూడండి రోజంతా కావాల్సిన పోషణ..!!

by Anjali |   ( Updated:2024-10-26 15:42:33.0  )
Adai: అల్ఫాహారంగా గుమ్మడి అడై..  మార్నింగ్ తిని చూడండి రోజంతా కావాల్సిన పోషణ..!!
X

దిశ, వెబ్‌డెస్క్: గుమ్మడికాయ(pumpkin) ఒక పోషకమైన మొక్కల ఆహారం. దీన్ని తింటే కంటిచూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి(heart health) మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి(Immunity power)ని పెంచడంలో సహాయపడుతుంది. డైటరీ ఫైబర్‌(Dietary fiber)ను సప్లిమెంట్ చేస్తుంది. అయితే ఇన్ని ప్రయోజనాలున్న గుమ్మడికాయను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. కాగా గుమ్మడికాయతో అడై ట్రై చేయండి. ఉదయాన్నే అన్ని రకాల పప్పులు వాడి గుమ్మడి అడై టిఫిన్ గా తయారు చేసుకోండి. ఈ కొత్తరకం అల్ఫాహారం రుచి అదిరిపోతుంది. మరీ తయారీ విధానం ఎలాగో చూద్దామా..

గుమ్మడికాయ అడై తయారీకి కావాల్సినవి..

2 కప్పుల గుమ్మడికాయ తురుము, సగం కప్పు మసూర్ పప్పు(Massor dal) లేదా ఎర్ర కందిపప్పు, పావు కప్పు శనగపప్పు, 3 పచ్చిమిర్చి, అరచెంచా ఉప్పు, 1 కరివేపాకు రెమ్మ, ఒకటిన్నర కప్పుల బియ్యం(rice), పావు కప్పు మినప్పప్పు, పావు కప్పు పెసరపప్పు, పావు టీస్పూన్ ఇంగువ, ఆయిల్ తీసుకోవాలి.

గుమ్మడికాయ అడై తయారీ విధానం..

బియ్యం, అన్ని రకాల పప్పులు తీసుకుని.. వీటిని కడిగి నాలుగైదు గంటలు నానబెట్టాలి. తర్వాత బియ్యం, పప్పులోని వాటర్(Water) వంపి.. అందులో ఇంగువ(inguva), సాల్ట్, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టి.. ఈ మిశ్రమంలో కరివేపాకు, గుమ్మడికాయ తురుము వేసి కలపాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి పెనం వేడాయ్యాక ఆయిల్ వేసి.. పక్క పెట్టిన పిండిని కాస్త మందంగా అట్లుగా వేసుకోవాలి. చివర్లో ఆయిల్ వేసుకుంటూ కాల్చితే పోషకభరిత(nutritious) గుమ్మడికాయ తయారు అయినట్లే. మీరు కూడా ఓసారి ట్రై చేయండి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed