Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. చర్చించే కీలక అంశాలివే!

by Shiva |
Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. చర్చించే కీలక అంశాలివే!
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఇవాళ సచివాలయం (Secretariat)లో సాయంత్రం 4 గంటలకు కేబినేట్ సమావేశం (Cabinet Meeting) జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏతో పాటు, వారి సమస్యలపై చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రెండు రోజుల క్రితం తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు (Leaders of Telangana Trade Unions) డీఏపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub Committe)ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా జీవో నెం.317 అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇక మూసీ బాధితుల (Moosi Victims)కు ఇచ్చే పరిహారంపై కూడా మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. బీసీ కుల గణన (BC Caste Enumeration), కొత్త ఆర్వోఆర్ చట్టం (New ROR Act)పై కూడా ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హైడ్రాకు చట్టబద్ధతతో పాటు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ అధికారాలు (GHMC Officials) ఇటీవలే హైడ్రా (HYDRA)కు కట్టబెడుతూ పురపాలక శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ యాక్ట్ చట్ట సవరణ బిల్లు (Municipal Act Law Amendment Bill) కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఇందిరమ్మ ఇళ్ల కమిటీ (Indiramma House Committes)లు, కొత్త రేషన్ కార్డు (New Ration Cards) అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

రైతులకు పెట్టుబడి సాయంతో పాటు రైతు భరోసా స్కీమ్‌ (Raithu Bharosa Scheme)పై కేబినెట్ చర్చించనుంది. విధివిధానాలను ఖరారు చేసే అంశంపై సమాలోచనలు చేయనుంది. నెలాఖరు లోపు ఇప్పటి వరకు రుణమాఫీ కాని రైతులకు స్కీమ్ వర్తింపజేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ భేటీలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది.

Advertisement

Next Story