Akira Nandan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పవన్ కళ్యాణ్ ఓజీలో అకిరా నందన్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..!

by Kavitha |   ( Updated:2024-10-26 14:35:22.0  )
Akira Nandan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పవన్ కళ్యాణ్ ఓజీలో అకిరా నందన్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..!
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan), డైరెక్టర్ సుజిత్(Director Sujith) కాంబోలో తెరకెక్కుతున్న తాజా మూవీ ‘ఓజీ’(OG). ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీయా రెడ్డి(Sriya Reddy) కీలక పాత్ర పోషిస్తుంది. కాగా ఈ చిత్రానికి తమన్(Thaman) సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఎన్నికల(Elections) కారణంగా ఈ మూవీ చిత్రీకరణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని పవన్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..

ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్(Akira Nandan) నటిస్తున్నాడని లేటెస్ట్ టాక్. ఈ మూవీలో అకిరా నందన్ మీద కొన్ని యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారని తెలుస్తోంది. దానికి సంబంధించిన ఒక వీడియో ఎక్స్‌(X)లో వైరల్ అవుతుంది. పవన్ మేనరిజంని ఇమిటేట్ చేస్తూ అకిరా ఫైట్ సీన్స్ చేస్తున్నాడు. వీడియో అంత క్లారిటీ లేకపోయినా అక్కడ ఉంది అకిరా నందనే అంటున్నారు ఫ్యాన్స్. అయితే సాధారణంగా స్టార్ వారసుల సినీ తెరంగేట్రంపై ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉంటారు. అలాగే అకిరా నందన్ ఎంట్రీపై కూడా ఫ్యాన్స్ అంతా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. అయితే అకిరా మాత్రం తెర మీద కాదు తెర వెనుక అంటే మ్యూజిషియన్‌గా మెప్పించాలని చూస్తున్నాడు. కానీ ఫ్యాన్స్ అకిరాను కచ్చితంగా హీరో చేయాల్సిందే అని పట్టుబడుతున్నారు.

కాగా అకిరా నందన్ ఓజీలో నిజంగా ఉన్నాడా అతనితో యాక్షన్ సీన్స్ చేస్తున్నారా అన్న దాని మీద క్లారిటీ లేదు. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. ఇదే జరిగితే మాత్రం ఓజీతో అకిరా ఎంట్రీ షురూ అయినట్టే లెక్క. సుజిత్ లాంటి ప్యాషనేట్ డైరెక్టర్ చేతిలో అకిరా తెరంగేట్రం సంథింగ్ స్పెషల్ కానుంది. ఇక ఈ సినిమాను 2025 సమ్మర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

Advertisement

Next Story