- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేసీఆర్ పదేళ్ల పాలనలో హిందూ, ముస్లింల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు : హరీష్ రావు

దిశ, సిద్దిపేట ప్రతినిధి : బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ హిందువుల, ముస్లిం అభ్యున్నతి కోసం పాటుపడ్డారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని సూఫీ మసీదు ఆవరణలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ముస్లిం సోదరులతో అలై బలై తీసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాలు అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మతాలకు అతీతంగా ఉగాది, రంజాన్ పండుగలను హిందూ ముస్లింలు సోదరభావంతో జరుపుకోవడం శుభపరిణామం అన్నారు. కొన్ని శక్తులు రెచ్చగొట్టే టువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకొని మతసామరస్యం చాటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, బీఆర్ ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.