- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి
దిశ, మరికల్: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని మాద్వార్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం, మహిళా సమాఖ్య భవనం తో పాటు, పుసల్ పహడ్ గ్రామంలో అంగన్వాడీ భవనం, రాకొండ గ్రామంలో మహిళా సమాఖ్య భవనానికి, మండల కేంద్రంలో ప్రాథమిక సబ్ సెంటర్ లకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకులు 60 సంవత్సరాలలో చేయని అభివృద్ది కేసీఆర్ నాయకత్వంలో 9 సంవత్సరాలలో చేసి, దేశానికి ఆదర్శంగా నిలిచామని అన్నారు.
హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ పథకాలు అందని ఇల్లు లేదని, రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీకళ రాజవర్థన్ రెడ్డి, వైస్ ఎంపీపీ రవికుమార్, సర్పంచ్ గోవర్దన్, ఎంపీటీసీ సుజాత శ్రీనివాసులు, గోపాల్, కో ఆప్షన్ మెంబర్ మతిన్, లంబడి తిరుపతయ్య, సంపత్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.