12 ఎంపీ సీట్లను ఇవ్వండి.. ఆరు నెలల్లో కేసీఆర్ రాష్ట్రంలో శాసిస్తాడు : కేటిఆర్

by Aamani |   ( Updated:2024-05-08 15:57:01.0  )
12 ఎంపీ సీట్లను ఇవ్వండి.. ఆరు నెలల్లో  కేసీఆర్ రాష్ట్రంలో శాసిస్తాడు : కేటిఆర్
X

దిశ,గద్వాల ప్రతినిధి : కృష్ణ జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా కృష్ణ జలాలను అప్పనంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి అప్పజెప్పాడని మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించాడు. బుధవారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో గద్వాల జిల్లా కేంద్రం వైఎస్సార్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. ముందుగా గద్వాల పట్టణంలో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి , పార్లమెంట్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ తో కలిసి కేటిఆర్ పెద్ద ఎత్తున రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటిఆర్ మాట్లాడుతూ..శాసనసభ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఓటర్లకు అరచేతిలో వైకుంఠం చూపించిందని వంద రోజుల్లో హామీలు అమలు చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో రాష్ట్రంలో సాగునీటి కి ,త్రాగు నీటి ఇబ్బంది తలెత్తిందని నాణ్యమైన కరెంట్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని తెలిపారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేవుడు పై ఒట్టు వేయడం ఓట్లు దండుకోవడమే పనిగా పెట్టుకొన్నాడని, ఊసరవెల్లి మాదిరి రేవంత్ రెడ్డి పాలన తీరు ఉందని అన్నారు. కల్యాణం కి తులం బంగారం ఇస్తానన్న హామీ ఇప్పటికి ఒక్కరికి కూడా ఇవ్వలేదని రాష్ట్రంలో లక్షన్నర పెండ్లిలు జరిగాయని మొత్తం బంగారాన్ని మహిళలకు ఇవ్వకపోతే వెంటపడి వసూలు చేసి తీరుతామని అన్నారు. రాష్ట్రం లో 12 ఎంపీ సీట్లను బీఆర్ఎస్ పార్టీ కి కట్టబెడితే ఆరు నెలల్లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తారని ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బిజెపి లోకి జంప్ అవుతారని కేంద్రంలో రాహుల్ గాంధీ మోదీ ని విమర్షిస్తుంటే రాష్ట్రం లో రేవంత్ రెడ్డి మోడీ ని బడే భాయ్ అని పొగుడుతున్నడని కేటిఆర్ తెలిపారు.

మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు చెప్పి మోసం చేశాడని, రాముని పేరిట బీజేపీ ఓట్లు అడుగుతున్నారని బీజేపీ ని ఆయన విమర్శించారు. ప్రతి బాంక్ అకౌంట్ లో 15 లక్షలు వేస్తా అని మోడీ చెప్పాడని కానీ ఇంతవరకు వేయలేదని అన్నారు. జిల్లా లో జోగులంబ దేవాలయానికి కేంద్రం నిధులు ఇవ్వలేదని కానీ కేసీఆర్ కాళేశ్వరం,పాలమూరు ,నెట్టoపాడు ప్రాజెక్ట్ ల ద్వారా ఆధునిక దేవాలయాలను నిర్మించారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పటికీ ఒకటి కాదు అని భవిష్యత్తులో కూడా కలిసి పని చేసేది లేదని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed