- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
దిశ, అచ్చంపేట: కేసీఆర్ కు ఓడిపోతామన్న భయం పట్టుకున్నదని అందుకే దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. జిల్లాలో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలంటూ కేసీఆర్ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అధికారం ఉందని విర్రవీగుతున్న కేసీఆర్ కు 2023 -24 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఉతికి బంగాళాఖాతంలో పడేస్తారన్నారు.
ప్రజలతో మమేకమవుతూ ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు పాదయాత్ర చేస్తున్న క్రమంలో ప్రజలు తమతో వారు పడుతున్న ఇబ్బందులను చెప్పుకున్నారన్నారు. దీనిని బట్టి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థమవుతుందన్నారు. పాము పడగ నీడలో భయం భయంగా బతికిన తెలంగాణ సమాజం ఇక అలా బతకలేమని పిడికిలి బిగించి తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని చెప్పారు.