- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీ కురుమూర్తి దేవస్థానం పాలకమండలి ఏర్పాటు
దిశ, చిన్న చింతకుంట : జిల్లాలో పేరుగాంచిన దేవాలయాలలో ఒకటైన శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థాన నూతన పాలకవర్గం ఏర్పాటుకు ప్రభుత్వం సిఫార్సు మేరకు 14 మంది సభ్యులతో నూతన కమిటీ ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ జీవో జారీ చేసింది. నూతన పాలకవర్గంలో గౌని గోవర్ధన్ రెడ్డి, ఏ భారతి, ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, శేఖర్, భాస్కరాచారి ,నాగరాజు, రాఘవేంద్ర బోయకమలాకర్, గౌని రాము, వన్నాడ గోపాల్, చక్రవర్ధన్ రెడ్డి, బాదం వెంకటేశ్వర్లు, ఎం రాములతో కూడిన జాబితాను విడుదల చేశారు. ముచ్చింతలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు గౌని గోవర్ధన్ రెడ్డి కి దేవస్థానం చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం. శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థాన నూతన పాలకవర్గం ఏర్పాటు చేస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ జీవో జారీ చేసిందని ఆలయ ఈవో మధనేశ్వర్ రెడ్డి తెలిపారు.
నూతన పాలకవర్గ సభ్యులకు సన్మానం
మండలంలోని దమగ్నాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే స్వగృహంలో శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థాన నూతన పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి శాలువాతో సత్కరించారు. దేవస్థాన నూతన పాలకవర్గ సభ్యులుగా ఎంపిక చేసినందుకు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కి నూతన పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నూతన పాలకమండలి సభ్యులు ఆధ్యాత్మిక చింతనతో పనిచేయాలని, శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థాన ప్రతిష్టకు భంగం కలిగించకుండా పనిచేయాలని నూతన పాలక మండలి సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు.