- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏరులై పారుతున్న కల్తీ కల్లు, నాటుసారా
దిశ, లింగాల : నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం పరిధిలోని రాంపూర్ గ్రామంలో నాటు సారా, కల్తీ కల్లు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. దీంతో సేవించిన ప్రజలు తాగిన మైకంతో ప్రతి రోజు అలర్లు సృష్టిస్తున్నారు. నాటుసారా నేరుగా సురాపూర్ గ్రామం నుంచి సరఫరా చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. కల్లు,నాటుసారా ఒకే దగ్గర ఉండడంతో..ఆ రెండింటిని సేవించి ప్రజలు తీకమక చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారుల వచ్చి దాడులు చేస్తున్నప్పటికీ కూడా మారడం లేదు. కల్తీ కల్లు సరఫరా ప్రతి రోజు రఘుపతి పేట,మరియూ లింగాల మండల కేంద్రము నుంచి తయారు చేసుకొని రాంపూర్ ,వాళ్లభాపూర్, భాకారం సాయిన్ పేట తదితర గ్రామాలకు బులోర వాహనాల్లో సరఫరా చేస్తున్నారు. ఎవరైన ఫిర్యాదు చేస్తేనే అధికారులూ ఆ సమయంలో హడావుడి చేసి పోతున్నారు. తప్ప వారిపై చర్యలు తీసుకోవడం లేదనీ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాల వారు కల్లు తయారు చేసి..ఇష్టమొచ్చినట్లు కల్తీ కల్లు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికైన ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కల్లు ను అరికట్టి,ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.