Chairman Gutta : కులగణన సర్వేలో వివరాలు అందించిన మండలి చైర్మన్ గుత్తా

by Y. Venkata Narasimha Reddy |
Chairman Gutta : కులగణన సర్వేలో వివరాలు అందించిన మండలి చైర్మన్ గుత్తా
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy)తన స్వగ్రామం చిట్యాల మండలం ఉరుమడ్లలో కుల గణన సర్వే(Caste census) కార్యక్రమం అధికారులకు తన వివరాలను అందించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు కుల గణనసర్వే చేస్తున్న అధికారులకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని సూచించారు. ఎలాంటి అపోహాలు పెట్టుకోకుండా తమ వివరాలు అన్ని వెల్లడించి సర్వేలో నమోదు చేయించుకోవాలని కోరారు.

ప్రజల సంక్షేమం కొరకు కృషి చేస్తున్న సర్కార్ కు ప్రజలు మద్దతుగా నిలవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మదర్ డైరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి , ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed