తెలుగు హీరోలను కూడా ప్రోత్సహించండి.. ఇంట్రెస్టింగ్‌గా టాలీవుడ్ నటుడు పోస్ట్

by sudharani |
తెలుగు హీరోలను కూడా ప్రోత్సహించండి.. ఇంట్రెస్టింగ్‌గా టాలీవుడ్ నటుడు పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ(Brahmaji) గురించి తెలిసిందే. సినిమాల్లో నటిస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తు్న్న ఈయన.. సోషల్ మీడియాలోను యాక్టీవ్‌గా ఉంటూ డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులతో సందడి చేస్తాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు బ్రహ్మాజీ. ఈ మేరకు.. ‘మలమాళం, తమిళ హీరోలతో పాటు మన టాలెంటెడ్ తెలుగు హీరోలను కూడా ప్రోత్సహించండి’ అంటూ పోస్ట్ పెట్టాడు. అయితే.. ఏ కొత్త సినిమా అయినా వీకెండ్ స్పెషల్‌గా శుక్రవారం రిలీజ్ అవుతుందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ శుక్రవారం అనగా నవంబర్ 22న.. మహేశ్ బాబు(Mahesh Babu) మేనల్లుడు అకోశ్ గల్లా (Ashok Galla) ‘దేవరీ నందన వాసుదేవ’(Devari Nandana Vasudeva), నటుడు సత్యదేవ్(Satyadev Kancharana) ‘జీబ్రా’(Zebra), మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) ‘మెకానిక్ రాకీ’(Mechanic Rocky) రిలీజ్‌కు ఉన్నాయి. ఈ సినిమాలను థియేటర్‌లలో చూసి మన తెలుగు హీరోలను సపోర్ట్ చేయండి అనే ఉద్దేశం వచ్చే విధంగా బ్రహ్మాజీ పెట్టిన పోస్ట్ ప్రజెంట్ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed