- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bandi Sanjay : ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ పనితీరు భేష్ : కేంద్ర మంత్రి బండి సంజయ్
దిశ, వెబ్ డెస్క్ : భారతదేశంలో ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా నిందితులను పట్టుకునేందుకు దోహదపడే వ్యవస్థ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ (CFSL)ని అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడం అభినందనీయమని, పనితీరు బాగుందని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay)అన్నారు. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలతోపాటు నార్కొటిక్, సైబర్, మనీ లాండరింగ్ నేరాలకు పాల్పడిన దోషులను పట్టుకునేందుకు దొహదపడేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో సీఎఫ్ఎస్ఎల్ సంస్థను తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. ఈరోజు మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తో కలిసి హైదరాబాద్ రామాంతాపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ(సీఎఫ్ఎస్ఎల్), నేషనల్ సైన్స్ ఫోరెన్సిక్ లాబోరేటరీ(ఎన్సీఎఫ్ఎల్), సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ (సీడీటీఐ) సంస్థలను కేంద్ర మంత్రి సందర్శించారు. మధ్యాహ్నం 2 గంటలకు విచ్చేసిన బండి సంజయ్ దాదాపు రెండున్నర గంటలపాటు అక్కడే గడిపారు. ఆయా సంస్థల్లోని ప్రతి విభాగానికి వెళ్లి పరిశీలించారు. అధికారులతో సమావేశమై ఆయా విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. దక్షిణ భారత దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థలు హైదరాబాద్ లో ఉండటం గర్వకారణమన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వేలాది కేసుల పరిష్కారానికి ఈ సంస్థలను సంప్రదించడంతోపాటు నేర పరిశోధనకు అవసరమైన ప్రామాణిక పత్రాలను సీఎఫ్ఎల్ఎల్ అందజేస్తోందని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు.
తొలుత సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీని సందర్శించిన బండి సంజయ్ ను సంస్థ జాతీయ విభాగం డైరెక్టర్ ఎస్.కే.జైన్, హైదరాబాద్ ఇంఛార్జ్ రాజీవ్ గిరోటీ స్వాగతం పలికారు. ఈ సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమైన కేంద్ర మంత్రి సీఎఫ్ఎస్ఎల్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ ఫోరెన్సిక్ డివిజన్, ఆక్సిజన్ ఫోరెన్సిక్ డివిజన్, డీఎన్ఏ, బయాలజీ డివిజన్, నార్కోటిక్, కెమిస్ట్రీ డివిజన్, ఫిజిక్స్ డివిజన్, సైకాలజీ డివిజన్ తోపాటు డాక్యమెంటేషన్ డివిజన్లను సందర్శించారు. క్లిష్లమైన కేసుల పరిష్కారంలో అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై అధికారులను అడిగి తెలుసుకోవడంతోపాటు కేంద్రం నుండి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు తగిన ప్రతిపాదనలను కోరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేతులు మీదుగా సంస్థ ఆవరణలో మొక్కలు నాటారు.
అనంతరం ఎన్సీఎఫ్ఎల్, సీడీటీఐ సంస్థలను కేంద్ర మంత్రి సందర్శించారు. అక్కడ సైతం ప్రతి విభాగాన్ని సందర్శించారు. అధికారులతో సమావేశమయ్యారు. ఆయా సంస్థల పనితీరుపై సంబంధిత శాఖ అధికారులు పవర్ పాయింట్ ఇచ్చారు. పోలీసులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు, న్యాయవాదులకు ఇప్పటి వరకు 39,167 మందికి సీటీడీఐ అధికారులు ప్రత్యేక శిక్షణనివ్వడంతోపాటు సైబర్ నేరాలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్న విషయాన్ని తెలుసుకున్న కేంద్ర మంత్రి సంస్థ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.