Amaran : ‘అమరన్’ సినిమా తెచ్చిన తంటా! మూవీ టీమ్‌ను రూ. కోటి పరిహారం కోరిన విద్యార్థి

by Ramesh N |   ( Updated:2024-11-21 13:36:47.0  )
Amaran : ‘అమరన్’ సినిమా తెచ్చిన తంటా! మూవీ టీమ్‌ను రూ. కోటి పరిహారం కోరిన విద్యార్థి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ నటుడు (Shiva Karthikeyan) శివకార్తికేయన్, నటి సాయిపల్లవి (Sai pallavi) జంటగా నటించిన సినిమా (Amaran) ‘అమరన్’. ఈ చిత్రాన్ని రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ (Kamal Hasan) నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ (Movie) వల్ల తనకు ఇబ్బంది కలిగిందంటూ విఘ్నేశన్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపాడు. సాయి పల్లవి ఫ్యాన్స్, హీరో ఫ్యాన్స్ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే నష్టపరిహారంగా రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

అయితే ఆ విద్యార్థి నష్టపరిహారం అడగడానికి కారణం ఏమిటంటే? అమరన్ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంలో సాయిపల్లవి హీరోకు తన ఫోన్ నెంబర్ ఇచ్చే సీన్ ఉంటుంది. దీని కోసం చిత్రబృందం ఒక నెంబర్ ఉపయోగించింది. అది చూసిన అభిమానులు సినిమాలో చూపించిన నంబర్‌కు ఫ్యాన్స్ వరుస ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేయడం స్టార్ చేశారు. అయితే ఆ నెంబర్ తనదేనని, ఫోన్ కాల్స్ వల్ల ప్రశాంతత లేకుండా పోయిందని, తన నంబర్ ఉపయోగించినందుకు తనకు మూవీ టీమ్‌కు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఇక దీనిపై చిత్ర బృందం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Next Story

Most Viewed