- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
J&K terror attack: బీబీసీకి కేంద్ర ప్రభుత్వం లేఖ.. పహెల్గాం కవరేజీపై తీవ్ర అభ్యంతరం

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి గురించి బీబీసీ చేసిన కవరేజ్ పై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. "ఘోరమైన కశ్మీర్ దాడి తర్వాత పాకిస్థాన్ భారతీయులకు వీసాలను నిలిపివేసింది" అనే శీర్షికతో బీబీసీ ఈ ఉగ్రవాద దాడి గురించి ప్రస్తావించింది. దాన్ని "మిలిటెంట్లు లేదా గన్ మెన్ల దాడి"గా పేర్కొంది. కాగా.. దీనిపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది. ఈ క్రమంలోనే పహెల్గాం దాడిపై బీబీసీ కవరేజీపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అభ్యంతరం వ్యక్తంచేస్తూ బీబీసీకి ఓ లేఖ రాసింది. అందులో మన దేశ బలమైన వాదనను బీబీసీ ఇండియా హెడ్ జాకీ మార్టిన్‌కు వివరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాక ఇక నుంచి ఈ దాడిపై బీబీసీ కవరేజీని పర్యవేక్షిస్తామని పేర్కొన్నట్లు తెలిపారు.
న్యూయార్క్ టైమ్స్ పై అమెరికా ఆగ్రహం
అయితే, అమెరికా విదేశాంగ శాఖ న్యూయార్క్ టైమ్స్ పై ఆగ్రహం చేసిన కొన్ని రోజుల నుంచి భారత ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవం విశేషం. పహెల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను "మిలిటెంట్లు" అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. కాగా... దీనిపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. దాడి చేసిన వారిని "మిలిటెంట్లు", "గన్‌మెన్" అని పిలవడం ద్వారా ఉగ్రవాద దాడి తీవ్రతను తగ్గించినందుకు విమర్శలు గుప్పించింది. ఎక్స్ లో ఈ మేరకు పోస్టు పెట్టింది. కాగా.. ఆ పోస్టులో మిలిటెంట్లు అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో టెర్రరిస్టులు అని బోల్డ్ రెడ్ కలర్ లో ఉంచింది.