Viral Video:నాగు పామును పట్టుకొని అడవిలోకి వదిలిన టీటీడీ ఉద్యోగి.. ఇంతకీ అది ఎక్కడకి వచ్చిందంటే?

by Jakkula Mamatha |   ( Updated:2025-04-28 06:50:59.0  )
Viral Video:నాగు పామును పట్టుకొని అడవిలోకి వదిలిన టీటీడీ ఉద్యోగి.. ఇంతకీ అది ఎక్కడకి వచ్చిందంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఎప్పుడు భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల(Tirumala)లో ఐదు అడుగుల నాగుపాము(Cobra) హల్​‌చల్​ చేసింది. తిరుమల తిరుపతి కొండపై వీఐపీ ప్రాంతం పద్మావతి ఏరియాలో నాగు పాము బుసలు కొడుతూ కలకలం రేపింది. తిరుమల నారాయణ గిరి స్పెషల్ కాటేజ్‌లో​ రూమ్​ 12 దగ్గర నాగు పాము భక్తులకు(Devotees) కనిపించింది. దీంతో ఐదు అడుగుల నాగుపామును చూడగానే.. భక్తులంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో ఆందోళనకు గురయ్యారు.

ఈ విషయం TTD సిబ్బందికి తెలియజేయడంతో వెంటనే అతను అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో టీటీడీకి చెందిన ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి భాస్కర్ నాయుడు అక్కడకి చేరుకొని.. అత్యంత చాకచక్యంగా నాగుపామును బంధించారు. ఆ పాము 5.5 అడుగులు ఉందని అతను తెలిపారు. విష సర్పాన్ని పట్టడానికి శ్రమించారు. అరగంట పాటు భక్తులు భయాందోళనకు(Panic) గురయ్యారు. అనంతరం ఆ నాగుపామును చేతితో పట్టుకొని పాపనాశనం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. నాగుపామును అక్కడి నుంచి తరలించడంతో స్థానికులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. చేతితో నాగుపామును పట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

https://x.com/ChotaNewsApp/status/1916387706185388317



Next Story

Most Viewed