ఎర్రపెంట ఆదివాసీ జీవితాల్లో మార్పు కోసం..

by Sumithra |
ఎర్రపెంట ఆదివాసీ జీవితాల్లో మార్పు కోసం..
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ఎర్రపెంట గ్రామ ఆదివాసీ జీవితాల్లో మార్పు తేవడం కోసం నైస్ స్వచ్ఛంద సంస్త కృషి ఏమోహం గత పది నెలలుగా అనేక సేవ కార్యక్రమాలు చేపడుతుంది. ఆదివాసీ జీవితాల్లో మార్పు కోసం చేస్తున్నామని సంస్థ నిర్వాహకుడు కొప్పూరు పూర్ణచందర్ రావు తెలిపారు. బుధవారం గ్రామానికి చెందిన చెంచు, గిరిజన కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, 14 పప్పు, ఆశీర్వాద్ గోధుమపిండి, చక్కెర, బెల్లం, రాగులు, సజ్జలు అనేక ఆహార వస్తు సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్గనైజర్ మాట్లాడుతూ తాను ఒక అనాధ బిడ్డనని, తన చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోయారని, ఆ తరువాత కొంతకాలం హైదరాబాదులో పని చేశానన్నారు.

తనలాంటి అనాధ బిడ్డలు అవస్థలు పడకూడదని అనాధ పిల్లలను చేరదీసి ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో నైస్ అనే సంస్థ ద్వారా 250 మంది విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు భోజన, నివాస సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల లోతట్టు ప్రాంతంలో ఉంటున్న 42 ఆదివాసి చెంచు గిరిజన విద్యార్థులకు మంచి విద్యతో పాటు, అనేక సామాజిక అంశాల పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. గత పది నెలలుగా ఎర్ర పెంటలో దాతల సహకారం మా సంస్థ ద్వారా రూ. 1.5 కోట్ల వరకు ఖర్చు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ వారు రక్తహీనత లోపం నుండి బయటపడేలా న్యూట్రిషన్ ఫుడ్ ను ప్రతి నెల నాలుగు లక్షలు వెచ్చించి అందజేస్తున్నామన్నారు. ప్రతి నెల రేషన్ బ్యాగుతో పాటు 14 రకాల వస్తువులు అందజేస్తున్నామని, నేడు 77 కుటుంబాలకు పంపిణీ చేశామన్నారు.

చెంచుల్లో మార్పు కోసం కృషి..

నాగర్ కర్నూలు జిల్లా లింగాల అచ్చంపేట ఆమ్రాబాద్ తదితర ప్రాంతాలలో సుమారు 12 వేల మంది చెంచు కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారన్నారు. ఎర్ర పెంట గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధిపరిచేందుకు వారిలో చైతన్యం తీసుకొచ్చి సామాజిక భద్రతతో పాటు, వారిలో సామాజిక చైతన్యం నిప్పి మార్పు దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ గ్రామంలో 30 ఎకరాలను సేంద్రియ వ్యవసాయం చేసేందుకు ఎంపిక చేసి సాగు వారి చేత చేయిస్తున్నామని, అందుకు విజయరామ్ అనే ఒక వ్యవసాయ శాస్త్రవేత్త సహకారంతో నాలుగు ఎకరాలలో కూరగాయలు 10 ఎకరాల్లో మొక్కజొన్న పంటను పూర్తిగా సేంద్రియం చేస్తూ వారిలో మరింత అవగాహన పెంచుతున్నామన్నారు.

గత ఏడాది విద్యార్థులకు జిల్లాలో ఉన్న అన్ని వసతి గృహాలలో ఆదివాసి వారికి ప్రత్యేకంగా దుస్తులు పంపిణీ చేశామని ఝాన్సీ, ఈనాడు నాగేశ్వరరావు వార్ల సహకారంతో పెద్దలకు సైతం బట్టలు పంపిణీ చేశామన్నారు. ఈ గ్రామంలో పూర్తిగా కల్లు, సారా మత్తు పదార్థాలను పూర్తిగా మాన్పించేల కృషి చేస్తున్నామని అందుకు వారి సహకారం కూడా సంపూర్ణంగా ఉందన్నారు. ఇలా అన్ని పెంటల పై దృష్టి సాధించేందుకు విడుతలవారీగా సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రధానంగా నన్నపనేని చౌదరి ధనుంజయ్ డివి సుబ్బారావు హైదరాబాద్ కు చెందిన ఝాన్సీగా ఉన్న ఆర్డీటీ సంస్థ కార్యకర్త రాధల సహకారం ఎంతగానో అందిస్తున్నారన్నారు.

Advertisement

Next Story

Most Viewed