ఎన్నికల సందేహాలకు, సమస్యలకు నేరుగా కలగవచ్చు

by Disha Web Desk 11 |
ఎన్నికల సందేహాలకు, సమస్యలకు నేరుగా కలగవచ్చు
X

దిశ, ప్రతినిధి,మహబూబ్ నగర్: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా సందేహాలు, సమస్యలు, ఫిర్యాదులు ఉంటే భారత ఎన్నికల కమిషన్ నియమించిన సాధారణ పరిశీలకులు షెవాంగ్ గ్యాచో భాటియా ఐఏఎస్ ను నేరుగా కాని, ఆయన మొబైల్ నెంబర్ 9059797275 కు గాని లేదా మెయిల్ ఐడీ generalobserver [email protected] కు, అలాగే ఎన్నికల వ్యయ పరిశీలకులు వరుణ్ రంగస్వామి ఐఆర్ఎస్ కు నేరుగా కాని, లేదా మొబైల్ నెంబర్ 8522875617, లేదా మెయిల్ ఐడీ [email protected] లో కూడా సంప్రదించవచ్చని వారు తెలిపారు.

నేరుగా సంప్రదించాలనుకునే వారు స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఉదయం 10-30 నుంచి సాయంత్రం 5 గంటలకు లోపు సంప్రదించవచ్చని కలెక్టర్ కార్యాలయం నుండి వెలువడిన ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజైన గురువారం అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయిన సందర్భంగా సాధారణ ఎన్నికల పరిశీలకులు షెవాంగ్ గ్యాచో భూటియా నామినేషన్ల ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు.



Next Story

Most Viewed